జాతినుద్దేశించి ప్రధాని లేఖ
తమ ఏడాది పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని, ఎక్కడా ఇసుమంత అవినీతి జరగలేదని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన జాతినుద్దేశించి లేఖ రాశారు. తాము ఏడాది కాలంలోనే సంస్కరణలను పరుగుపెట్టించామని, పాలనలో పారదర్శకత పెంచామని తెలిపారు. ఉపాధికి బాటలు పరిచి, అభివృద్ధికి పునాది వేశామని వెల్లడించారు. ఇప్పుడు భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని తెలిపారు. ఏడాది పాలనపై ట్విట్టర్ ద్వారా తనతో అభిప్రాయాలు పంచుకోవాలని ప్రజలను కోరారు.