జాతీయస్థాయి ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుల వివరాలలో తప్పులు దొర్లకుండా ఎంట్రీ చేయాలి
– స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మనూ చౌదరి
నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో అక్టోబర్ 19 జనం సాక్షి:
ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డుల కోసం గ్రామ పంచాయతీలలో చేపట్టిన అభివృద్ధి పనుల సమాచారాన్ని సక్రమంగా ఎలాంటి తప్పులు లేకుండా ఆన్ లైన్ లో పొందుపర్చాలని ఎంపీడీవోలు ఎంపిఓ లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మనూ చౌదరి ఆదేశించారు.
బుధవారం కలెక్టర్ కార్యాలయా సమావేశ మందిరంలో డిఎల్పిఓలు, ఎంపీడీవోలు ఎంపీఓలతో జాతీయ పంచాయతీ అవార్డు కార్యాచరణపై అదనపు కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 461 జీపీలలో చేపట్టిన అభివృద్ధి పనులు వివరాలకు సంబంధించిన డేటా ఎంట్రీ పనులు తప్పులు దొర్లకుండా ఆన్ లైన్ లో అప్లోడ్ లైన్ లో చేయాలన్నారు.
వీటి ఆధారంగా ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వ
వీటి ఆధారంగా ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వస్తారని, అప్లోడ్ చేసిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాలన్నారు.
ఇప్పటివరకు నమోదు చేసిన చాలా పంచాయతీల వివరాల్లో తప్పులు ఉన్నాయని, వాటిని సరి చేసేందుకు ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి సమగ్ర వివరాలను వెబ్ సైట్లు నమోదు చేయాలన్నారు.
జాతీయస్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీల నమోదు వివరాలను చివరి తేదీ ఈ నెల 31 లోగా సమగ్ర వివరాలను నమోదు పరచాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ, పిడి డిఆర్డిఏ నర్సింగ్ రావు, జడ్పీ సీఈవో ఉష, డిఆర్డిఓ అదనపు పిడి రాజేశ్వరి, శ్రీనివాసులు, డి ఎల్ పి ఓ లు ఎంపీడీవోలు ఎంపీలు ఏపీడీలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area