జాతీయస్థాయి కరాటే పోటీలో పెబ్బేరు చాంపియన్‌షిప్
హైదరాబాద్ ఉప్పల్ బండి ఆంజనేయ గార్డెన్ నందు ఆదివారం జాతీయస్థాయి కరాటే చాంపియన్‌షిప్ పోటీలలో పెబ్బేరుకు చెందిన సుమన్ షోటూ కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని గెలుపొందారని కరాటే మాస్టర్ శ్రీనివాసులు తెలిపారు.
వారిలో కథస్ విభాగంలో జోషిక,కౌశిక్,బన్నీ,లాలు,మౌలాబి ,ట్వింకిల్ రెడ్డి,చందన,జ్ఞానేశ్వర్,ఆదిత్ య,సాయి రోహన్ లు గెలుపొందారని మరియు స్పారింగ్ విభాగంలో భీష్మా నాథ్,పవన్ నాయక్,హేమంత్,ప్రథమ ద్వితీయ స్థానాలు గెలుపొందారని గెలుపొందిన వారికి. గ్రాండ్ మాస్టర్. మల్లికార్జున్ గౌడ్ చేతుల మీదుగా మెడల్స్ సర్టిఫికెట్స్ అందజేశారని తెలియజేశారు. సందర్భంగా కరాటే మాస్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం ఆత్మరక్షణకు దోహద పడుతుందని అన్నారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిషత్తు ఉంటుందన్నారు. సమాజంలో రోజురోజుకూ ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలంటే బాలికలు తప్పకుండా కరాటే నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు కరాటేలో శిక్షణ అందించేందుకు ఆసక్తి కనబరచాలని తెలిపారు.