జాతీయ ఐక్యతా ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు
మల్దకల్ అక్టోబర్ 31(జనంసాక్షి) మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం పురవీధుల గుండా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని ఐక్యత ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా బస్టాండు ఆవరణలో మానవహారం నిర్వహించి జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ ఎం రమేష్ లింగం మాట్లాడుతూ ప్రాంత ,కుల,మతాలకు అతీతంగా అందరూ ప్రజలు సామరస్యంగా అన్నదమ్ముల్లాగా కలసిమెలసి జీవించి జాతి సమైక్యతలో తోడ్పడాలని సూచించారు. ప్రతి ఒక్క పౌరుడు అఖండ భారతావని నిర్మించడానికి చేయి చేయి కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు.అఖండ భారత నిర్మాణం యువకుల చేతుల్లో ఉందని దానిని నిర్మించే బాధ్యత యువకులు భుజస్కందాలపై వేసుకొని జాతి సమగ్రతను సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ స్ఫూర్తితో కాపాడాలన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1,2 ప్రోగ్రామ్ ఆఫీసర్లు రామాంజనేయులుగౌడ్, నరసింహులు అధ్యాపకులు శివకుమార్ ,గోవర్ధన్ శెట్టి, భాగ్యలక్ష్మి, శ్రీనివాసులు, తిమోతి ,శ్రీనాథ్ ,రమేష్, జయరాం,ఆంజనేయులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.