జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో కవి సమ్మేళనం

 

మల్దకల్ నవంబర్ 18(జనం సాక్షి)జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయాల ఆవశ్యకత అనే అంశంపై కవి సమ్మేళనంను శుక్రవారం ఏర్పాటు చేశారు.ఈ కవి సమ్మేళనంలో మల్డకల్ గ్రామ,నివాసి సుంకరి బసవరాజప్ప, అధ్యాపకులు పాల్గొన్ని కవిత పఠణం చేయడం జరిగింది.కవిత పఠణం చేసినందుకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్ గౌడు,గట్టు ఎమ్.పి.పి.విజయ్ కూమార్,విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య, స్వామి,మెమొంటో,శాలువాతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి ప్రతాప్, గ్రంథాపాలకుడురామాంజనేయులు,కవులు వేంకటరామయ్యశేట్టి, భానుప్రకాస్,పవణ్ కూమార్, మహేందర్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.