జాతీయ జెండాను అవమానపరిచినందుకు హార్థిక్ పటేల్ అరెస్టు
రాజ్‌కోట్,అక్టోబర్19(జనంసాక్షి): పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలంటూ గుజరాత్‌లో ఉద్యమం లేవనెత్తిన పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ ఈ రోజు అరెస్టయ్యారు. జాతీయ పతాకాన్ని అవమానించినందుకు ఆయనను ఆరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజ్‌కోట్ రూరల్ ఎస్పీ గగన్ దీప్ గంభీర్ తెలిపిన వివరాల ప్రకారం… ఆదివారం గుజరాత్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌ని అడ్డుకునే క్రమంలో హార్దిక్‌ని పోలీసులు అడ్డగించారని అప్పుడు ఆయన తన కారుపై నుంచి త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని కిందికి దూకారన్నారు. ఆ సమయంలోజాతీయపతాకాన్ని ఆయన కాలితో తాకి అవమానించారని తెలిపారు. అది చట్టరీత్యా నేరమని చెప్పారు. సంబంధిత వీడియో ఫÛటేజీలను తాము నిశితంగా పరిశీలించిన మీదటే ఆయనను అరెస్టు చేసినట్లు చెప్పారు.