జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం

వరంగల్ ఈస్ట్  సెప్టెంబర్ 15(జనం సాక్షి)
 రంగశాయిపేట లో 1 సంవత్సరము నుండి 19 సంవత్సరాల వయసు కలిగిన బాల బాలికలకు డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ జాతీయ నులిపురుగుల వలన సంభవించు అనారోగ్య సమస్యలు వాటి నివారణ పై విద్యార్థినీ విద్యార్థులచే పాలుపంచుకున్నారు జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా డి వామింగ్ గోలీలు 1 సంవత్సరము నుండి రెండు సంవత్సరాల పిల్లలకు హాఫ్ టాబ్లెట్ 2 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు వారికి పూర్తి టాబ్లెట్ విధిగా నిర్దేశించిన ప్రతి బాల బాలికలకు అందెటట్లు చూడాలని డాక్టర్ నాగరాజు కోరినారు
ఈ కార్యక్రమమును టాబ్లెట్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉపయోగించుకోవాలని డాక్టర్ నాగరాజు కోరినారు.
 నులి పురుగు నిర్మూలన కార్యక్రమంలో ఎలాంటి అవాంతరాలు జరగవని తెలిపినారు ఒకవేళ ఏమైనా సమస్యలు వస్తే వైద్యాధికారీ సంప్రదించాలిని కోరారు. ఈ సందర్బంగా మందులు పంపిణి చేసిన డాక్టర్ నాగరాజు. రంగశాయిపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రములో నూలి పురుగుల నివారణ ఈ కార్యక్రమంలో యూ.పి.హెచ్.సి. , సి.ఓ. .ఎలుగు సుజాత , ఏ.ఎన్.యం , ఫార్మసిస్ట్ తీగల సతీష్ కుమార్ , తద్దితరాలు పాల్గొన్నారు.