జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలను రూపొందించాలి- డిఈఓ గోవిందరాజులు

నాగర్ కర్నూలుజిల్లాబ్యూరో నవంబర్ 1 జనంసాక్షి :
దేశంలోని బాలల్లో విజ్ఞాన శాస్త్రం పై ఆసక్తిని పెంపొందించి సృజనాత్మకతను ప్రదర్శించడానికి శాస్త్రీయ పద్ధతుల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషిచేసి సామర్ధ్యం పెంచుకొని తద్వారా సమాజానికి ప్రయోజనం చేకూర్చేందుకు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఒక ప్రత్యేక వేదికగా ఏర్పడిందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ గోవిందరాజులు అన్నారు.
మంగళవారం డిఈఓ కార్యాలయంలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల నుండి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రధాన అంశం:: ఆరోగ్యం మరియు సంక్షేమం కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం
ఉప అంశాలు:: 1. మీ పర్యావరణ వ్యవస్థ గురించి తెలుసుకో
 2. ఆరోగ్యం,పోషణ మరియు సంక్షేమం పెంపొందించడం
3. పర్యావరణ వ్యవస్థ మరియు ఆరోగ్యం కోసం సామాజిక మరియు సాంస్కృతిక పద్ధతులు
4. స్వీయ విశ్వాసం కోసం పర్యావరణ వ్యవస్థ ఆధారత విధానం
5. పర్యావరణ వ్యవస్థ మరియు ఆరోగ్యం కోసం సాంకేతికత ఆవిష్కరణ
పైన తెలిపిన అంశాల నుండి ఏదేని ఒక అంశానికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్ తయారుచేసి ప్రదర్శించాలన్నారు. ఈ ప్రాజెక్టు రిపోర్టు తయారీలో ఆరు నుండి పది తరగతుల విద్యార్థులలో ఇద్దరిని జట్టుగా చేసి ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయడంలో సైన్స్ ఉపాధ్యాయుడు సహకరించాలని సూచించారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల నుండి ఒక జీవశాస్త్ర ఉపాధ్యాయుడికి శుక్ర శనివారాలలో తాలూకా స్థాయిలలో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరిన్ని వివరములకు జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి(9989921105)ని సంప్రదించాని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, ఏసి రాజశేఖర్ రావు, సెక్టోరల్ అధికారి వెంకటయ్య, ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ ప్రసాద్ గౌడ్, స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర్ల శెట్టి,పాల్గొన్నారు.