*జాతీయ బోదవ్యాధి మాత్రల పంపిణీ*
మునగాల, అక్టోబర్ 20(జనంసాక్షి): మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో జాతీయ బోదవ్యాధి మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గురువారం పరిశీలించారు. ఇంటికి వెళ్లి మాత్రలు పంపిణీ అవుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా డిఈసీ, ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని.. దీనివల్ల 100% బోధ వ్యాధి క్రిములు నాశనం అవుతాయని అన్నారు. వ్యాధికారక దోమలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే నిర్వహించుకోవాలని ప్రజలను కోరారు. ఫైలేరియా వ్యాధి శరీరంలోని చేతులకు, పురుషాంగాలకు, రొమ్ము భాగానికి, మర్మాంగాలకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు యాతాకుల మధుబాబు, బందెల రాములు, ముకుందాపురం ఆరోగ్య ఉప కేంద్రం ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు.