*జాతీయ భాష హింది దినోత్సవ వేడుకలు*
మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 14
(జనం సాక్షి)
జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని యుపిఎస్ వెంకట్రావు పేట స్కూల్ లో జాతీయ భాష హింది దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినవి ఈ సందర్బంగా హింది లో వివిధ పోటీలు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా హింది లిఖిత పరీక్ష పోటీలో ప్రథమ బహుమతి కాయితీ హర్షిత్, ద్వితీయ బహుమతి గోపిడి పల్లవి, తృతీయ బహుమతి కాయితీ రిత్విక, హింది బాల్ గీత్ పోటీలో ప్రథమ బహుమతి వాఘమారే సంఘర్షణ్,ద్వితీయ బహుమతి మొద్దు సాహిత్య, తృతీయ బహుమతి గోపిడి పల్లవి లు పొందారు, వీరికి బహుమతులు యుపిఎస్ వెంకట్రావు పేట ఇంచార్జి హెడ్ మాస్టర్ రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్
టీఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు అల్లకట్టు సత్యనారాయణ అందజేశారు ఈ సందర్బంగా ఇంచార్జి హెడ్ మాస్టర్ అల్లకట్టు సత్యనారాయణ మాట్లాడు తు హింది విశ్వ భాష గా, జాతీయ భాష గా, భారత రాజ్యాంగం ద్వారా గుర్తింపు పొంది, దేశం లో ప్రపంచం లో అధికంగా మాట్లాడే, అర్థం చేసుకునే భాష హింది అని భారత దేశం లో హింది ద్వారా భిన్నత్వం లో ఏకత్వము
శాంతి,సమానత్వం, పెంపొందుతున్నాయని తెలిపారు