జాతీయ రహదారిపై నా మొక్కల సంరక్షణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులది: రమేష్, అదనపు కలెక్టర్ జనం సాక్షి కొల్చారం:
జాతీయ రహదారులకు తిరుపక్కల నాటిన అవెన్యూ ప్లాంటేషన్ ముక్కల సంరక్షణ బాధ్యత ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు దేనిని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు.
కొల్చారం మండల పరిధిలోని వివిధ గ్రామాలలో అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారికి ఇరుపక్కల రోడ్డు డివైడర్లలో నాటిన మొక్కల పెంపకాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) రమేష్ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల బృందం సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈనెల 23న ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ పర్యటనలో భాగంగా కొల్చారం మండల పరిధిలోని జాతీయ రహదారికి ఇరుపక్కల రోడ్డు డివైడర్లలో మొక్కలు నటడం, కొమ్మల కత్తిరింపు, బుష్ కటింగ్ తదితర కార్యక్రమాలు ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టారు. ఈ పనులను సోమవారం సాయంత్రం అధికారుల బృందం పరిశీలించారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాస్ గౌడ్ జెడ్పి సిఈఓ శైలేష్ కుమార్, డిపిఓ సాయిబాబా, డిఎఫ్ఓ రవి ప్రసాద్, ఎంపీడీవో గణేష్ రెడ్డి ఏపీవో మైపాల్ రెడ్డి ఎంపీ ఓ కృష్ణవేణి మండలంలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఉపాధి సాంకేతిక నాయకులు పాల్గొన్నారు.