జాతీయ విపత్తుగా ప్రకటించండి

5

– కేంద్రానికి జయలేఖ

చెన్నై,డిసెంబర్‌9(జనంసాక్షి): తమిళనాడులో ఇటీవల సంభవించిన భారీ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.కనీవినీ ఎరుగని రీతిలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు చెన్నై మహానగరంలో నీట మునిగిన సంగతి తెలిసిందే. నగరంలోని అన్ని ప్రాంతాలు కొన్నిరోజుల పాటు వరదలో చిక్కుకుపోయాయి. విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు వరదనీటిలో చిక్కుకుపోవడంతో చెన్నైకి కొద్దిరోజుల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమయంలో ప్రధాని మోదీ చెన్నైలో విహంగ వీక్షణం చేసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. తమిళనాడును ఆదుకుంటామని హావిూ ఇచ్చారు. తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ప్రకటించారు. వివిధ సంస్థలు, తమవంతుగా సాయం ప్రకటించాయి. కాగ్నిజెంట్‌ భారీ విరాళాన్ని ప్రకటించింది.