జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా నియోజకవర్గ భారీ ర్యాలీ
జనం సాక్షి: నర్సంపేట
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. నర్సంపేట ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి వ్యవసాయ మార్కెట్ వరకు జాతీయ జెండాలతో ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం మార్కెట్ నందు బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశం మొత్తానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15న సిద్ధిస్తే… తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో తెలంగాణ విలీనం కావడం జరిగింది.భారతదేశంలో తెలంగాణ విలీనమై 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా నేడు మనం ఈ వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది.
రేపు నర్సంపేట నియోజకవర్గం లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల పైన పాఠశాలలు, కళాశాలల పైన మరియు మండల హెడ్ క్వార్టర్లలో జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన కుమ్రం భీమ్ ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నియోజకవర్గంలోని గిరిజనులు పెద్ద ఎత్తున తరలి వెళ్లి అక్కడ జరిగే సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.
దానికి గాను ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది..
అలాగే ఎల్లుండి 18వ తేదీ వజ్రోత్సవం ముగింపు సభ వరంగల్ జిల్లా కేంద్రంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది.
నియోజకవర్గంలో ఉత్సవాలకు తరలివచ్చిన ప్రజలందరికీ ప్రభుత్వం భోజన సదుపాయం ఏర్పాటు చేసింది.నర్సంపేటలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా వల్ల దేశంలోనూ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అయినా గాని వాటన్నిటిని అదిగమించి నర్సంపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పదంలో తీసుకుపోవడానికి నేను కృషి చేస్తున్నాను.
ఈ వజ్రోత్సవాల సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఒక శుభవార్త తెలియజేస్తున్నాను.. ఈ దసరా కానుకగా నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి వారి వారి స్థలంలో 5000 మందికి తక్కువ కాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో వ్యవసాయ, విద్య, వైద్య, రోడ్డు, రవాణా, ఇరిగేషన్ శాఖలకు సంబంధించి అనేక అభివృద్ధి పనులు మంజూరు చేయించాను.నియోజకవర్గ గ్రామాల నుండి తరలివచ్చిన అశేష ప్రజానీకానికి ఈ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా నా శుభాకాంక్షలు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ , నర్సంపేట ఆర్డీవో పవన్ కుమార్ , మున్సిపల్ కమిషనర్ వెంకట స్వామి , వైస్ చైర్మన్, జెడ్పి ఫ్లోర్ లీడర్, ఓడిఎంఎస్ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, కౌన్సిలర్లు, పిఎసిఎస్ చైర్మన్లు ,ఐకేపీ ఏపీఎం లు, సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, మహిళా సంఘాలు, పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ భాద్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|