జాతీయ స్థాయి ఇంజనీరింగ్, వైద్య విద్య పోటీ పరీక్షలలో సిద్దార్థ్ పూర్వ విద్యార్థుల ప్రతిభ..
జనం సాక్షి ప్రతినిధి మెదక్
మెదక్ : మెదక్ పట్టణంలోని వెంకట్ రావు నగర్ కాలనీలోని సిద్దార్థ్ ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు పలు ప్రవేశ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరచారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష JEE – అడ్వాన్స్డ్ & మెయిన్స్ బి. ఆనంద్ 66 ర్యాంకు, A. శ్రీకర్, 88వ ర్యాంకులతో పాటు పి. ప్రణయ్, కె. నాగేందర్ రావుతో పాటు కె. అవినాష్ రెడ్డి లు ఉత్తమ ర్యాంకులు సాధించారు. అలాగే జాతీయ స్థాయిలో నిర్వహించే వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీటిలో మునజ్జ ఆరా ఆఫియా 2017 వ ర్యాంకు, వి. సంగీత 504 వ ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా సిద్దార్థ్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ. కె. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతూ పట్టుదల, శ్రమ ఉంటే ఎంతటి పోటీ పరీక్షలలోనైనా విజయం సాధించ – వచ్చని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి. కె. సంధ్యారాణి గారు మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సాధించడంhu గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలకు చెందిన ఇంచార్జీలు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.