జానారెడ్డికి పోరాడే దమ్ము లేదు

3
– పాల్వాయి గోవార్ధన్‌ రెడ్డి

తెలంగాణలో దుష్టపాలన సాగుతోంది: పాల్వాయి

హైదరాబాద్‌,అక్టోబర్‌20 (జనంసాక్షి): తెలంగాణలో దుష్టపాలన నడుస్తోందని, అందువల్ల కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి అవకాశముందని, ఈ విషయాన్ని పార్టీ అధినేత సోనియాకు చెప్పానని ఎంపీ పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఆమెకు వివరించానన్నారు.  మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డిలో పోరాట పటిమ లేదని పాల్వాయి చెప్పారు. పోరాట స్ఫూర్తి లేకపోతే అధికారంలోకి రావడం కష్టమన్నారు. పోరాట పటిమతోనే మర్రి చెన్నారెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అప్పట్లో అధికారంలోకి వచ్చారని పాల్వాయి గుర్తు చేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌ పాత్ర పరిమితంగానే ఉందన్నారు. మిడిమిడి జ్ఞానంతో సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని  నడిపించలేరని పాల్వయి విమర్శించారు. తెలంగాణలో పాలనంతా నలుగురి చేతిలోనే ఉందని, ఇలాగే కొనసాగితే ఎమ్మెల్యేలు, ఎంపీలను రాళ్లతో కొడతారని పాల్వాయి చెప్పారు. కెసిఆర్‌ను ఊరూరా కొట్టే రోజులు త్వరలోనే వస్తాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను కాంగ్రెస్‌ ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సి ఉందన్నారు. దిగ్విజయ్‌ తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డికి శాసనసభలో పోరాడేతత్వం కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అన్నారు. జానారెడ్డి సభలో పోరాడేతత్వాన్ని నేర్చుకోవాలని సూచించారు. పోరాటస్ఫూర్తి లేకపోతే పార్టీ అధికారంలోకి రావడం కల్ల అని ఆయన అభిప్రాయపడ్డారు. సంవత్సరంన్నర పాలనలో కేసీఆర్‌ ప్రభుత్వం సాధించింది ఏమీలేదని ఆయన విమర్శించారు.