జాబ్‌మేళాలు నిర్వహించడం సంతోషం

యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలి: ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌  (జనం సాక్షి):   : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో టాస్క్‌ (TASK) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐటీ జాబ్‌మేళాను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రారంభించారు. జాబ్‌మేళాకు (Job Mela) పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చారు. ఇందులో గ్లోబల్‌ లాజిక్‌తోపాటు వివిధ విదేశీ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన 41 కంపెనీలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. జాబ్‌మేళాలో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పారు. గత జాబ్‌మేళాలో ముగ్గురు దివ్యాంగులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.యువత కోసం ఇలాంటి జాబ్‌మేళాలు నిర్వహించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. గ్రామీణ యువతకు ఇది గొప్ప అవకాశమని చెప్పారు. ప్రతి నెలా ఇలాంటి జాబ్‌ మేళాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే గణేశ్‌ గుప్తా అన్నారు. ఎమ్మెల్సీ కవిత సహకారంతో ఎన్నో విదేశీ కంపెనీలు ఇక్కడికి వచ్చాయన్నారు.

తాజావార్తలు