జార్ఖండ్ విడిపోయింది… అభివృద్ధి చెందింది
– బీహార్ వెనుకబాటుకు లాలూ, నితీష్‌లే కారణం
– మోదీ
పట్నా నవంబర్ 1 (జనంసాక్షి):
బిహార్‌లో లాలూప్రసాద్, నితీష్‌కుమార్‌ల ఆటవిక పాలనకు చరమగీతం పాడాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధుబనిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళల సమస్యలను బిహార్ ప్రభుత్వం పట్టించుకోకపోవటం విచారకరమన్నారు. బిహార్‌లో గత పాలకుల వల్లే మహిళల అక్షరాస్యత తక్కువగా ఉందన్నారు. బిహార్ పాలకులు సమస్యలను పట్టించుకోకపోవటం వల్ల కార్పూరి ప్రజలు ప్రధానిని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. గత 60 ఏళ్లలో పాలకులు మహిళల విద్యపై శ్రద్ధ చూపలేదన్నారు. బిహార్ ప్రజలు తమ ఓటుతో గత పాలకులకు ధీటైన సమాధానం చెప్పాలని కోరారు.
పట్నా: బిహార్‌లో లాలూప్రసాద్, నితీష్‌కుమార్‌ల ఆటవిక పాలనకు చరమగీతం పాడాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధుబనిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళల సమస్యలను బిహార్ ప్రభుత్వం పట్టించుకోకపోవటం విచారకరమన్నారు. బిహార్‌లో గత పాలకుల వల్లే మహిళల అక్షరాస్యత తక్కువగా ఉందన్నారు. బిహార్ పాలకులు సమస్యలను పట్టించుకోకపోవటం వల్ల కార్పూరి ప్రజలు ప్రధానిని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. గత 60 ఏళ్లలో పాలకులు మహిళల విద్యపై శ్రద్ధ చూపలేదన్నారు. బిహార్ ప్రజలు తమ ఓటుతో గత పాలకులకు ధీటైన సమాధానం చెప్పాలని కోరారు.