హరారే: జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా.. సొంతగడ్డపై సమష్టిగా విఫలమైన జింబాబ్వే ప్రస్తుతం ఒత్తిడిలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని యువ భారత్ ఉవ్విళ్లూరుతోంది.