జిఎస్టి తెచ్చి పేద ప్రజల నడ్డి విరుస్తుంది

ముస్తాబాద్ ఆగస్టు   జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది  మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి పాదయాత్ర ఈనెల తొమ్మిదవ తేదీన గంభీరావుపేట పెద్దమ్మ స్టేజి నుంచి ప్రారంభమై 18వ తేదీ ఎల్కతుర్తి  వరకు జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పాత్ర, ప్రపంచ పటంలో భారతదేశ చిత్రము రూపంలో కనిపించడానికి కృషి చేసిన ప్రధానమంత్రి నెహ్రూ , ఇందిరా గాంధీ ,టెక్నాలజీ తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన పీవీ నరసింహారావు , మన్మోహన్ సింగ్ దేశ పురోగతికి ఎంతో కృషి చేసినారు. మరి ఇప్పుడు 8 సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం వచ్చి పెట్రోల్, డీజిల్,  వంటగ్యాసు, నిత్యావసర సరుకుల ధరలు పెంచి కరోనా సమయంలో భారత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది జిఎస్టి తెచ్చి పేద ప్రజల నడి విరుస్తుంది అగ్నిపతు రద్దు చేయాలి వరద బాధితులకు వెంటనే సహకారం అందించాలని చెప్పి ప్రభుత్వo మెడల్ వంచి ప్రజలకు న్యాయం జరిగే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ,అభిమానులు, నాయకులు ,మహిళలు, రైతులు, నిరుద్యోగులు, యువత ,ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుచు కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీటీసీ గుండెల శ్రీనివాస్ ముస్తాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు నా మాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు మాదాస్ అనిల్ మొర్రాయపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు కుమార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉ చ్చుడి బాల్రెడ్డి , అరుట్ల మహేష్ రెడ్డి, బాలరాజు, కాంగ్రెస్ మండల యువత అధ్యక్షులు రంజాన్ నరేష్. ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు సారు రాకేష్, సద్ది మధు తదితరులు పాల్గొన్నారు.