జిఎస్టీతో మరిని వస్తువుల ధరలకు రెక్కలు !
జిఎస్టీతో వాయింపులతో దేశంలో అత్యధికశాతం ప్రజానీకం తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ధరలు మోత మోగిస్తున్నాయి. ప్రతి వస్తువూ ధరలు పెరిగి సామాన్యుడిని కోలుకోకుండా చేస్తోంది. కరోనాతో అనేక వస్తువుల ధరలు పెరిగిన సందర్బంలో జిఎస్టీ వడ్డింపులు అదనంగా బాధ పెడుతున్నాయి. అయినా కేంద్రా నికి జనం బాధలు పట్టడం లేదనాడినికి తాజా నిర్ణయాలు గుర్తించాలి. ఓ వైపు వ్యవసాయ చట్టాలు రద్దుచేసి క్షమించిండని ప్రధాని దేశ ప్రజలను కోరుతూనే వారికి వాతలు పెటట్డంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రజల కాంక్షలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ జిఎస్టీని రాబడిగా చూస్తున్నారు. ప్రజలేమైతే నాకేంటన్న ధోరణిపైనా పోరాటు తప్పవేమో. భారత దేశంలో పేదమధ్య తరగతి ప్రజలే అధికమన్న సంగతిని గుర్తించడం లేదు. ఏ పన్ను విధించి నా అది నేరుగా ప్రజలపైనే పడుతుందని, దానివల్ల ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో గుర్తించ కుండా కేవలం జిఎస్టీ పరమౌషధం అన్న విధంగా ప్రచారం చేస్తూ వచ్చారు. భారతదేశంలాంటి దేశంలో 18శాతం అవసరమా అన్న ఆలోచన చేయడం లేదు. కేవలం 5శాతం సరిపోతుందని, అప్పుడు ఎక్కువ మంది జిఎస్టీ పరిధిలోకి వచ్చే అవకా శాలు పెరుగుతాయని, ఆర్థిక నిపుణులు మొత్తుకుంటున్నా పట్టించు కోని మోడీ సర్కార్, తాజాగా కొన్ని వస్తువుల పై జిఎస్టీ మరింతగా పెంచి తన కక్షసాధింపు ధోరిణిని అవలంబిస్తున్నారు. ఎపిలో మద్యం ధరలు పెంచి ప్రజలు మద్యం జోలికి పోకుండా చేశామని సిఎం జగన్ చెప్పినట్లుగా ధరలు పెంచి ఉన్నతవర్గాలు మాత్రమే కొంటారన్న వితండవాదనలో కేందరం ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా సవరించిన జిఎస్టీ రేట్ల కారణంగా కొత్త ఏడాది జనవరి 1 నుంచి వస్త్రాలు, చెప్పులు మరింత ప్రియం కానున్నాయి. సింథటిక్ దారాలు, నూలు, వస్త్రాలు, దుస్తులపై ఇప్పటి వరకు 5 నుంచి 18 శాతం మధ్య ఉన్న వస్తు సేవల పన్ను జీఎస్‌టీను ప్రభుత్వం ఒకే విధంగా 12 శాతం పరిధిలోకి తీసుకొ చ్చింది. దీంతో ఈ ఉత్పత్తుల ధరలు మరింత పెరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు సీబీఐసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ముడి పదార్దాలపై ఎక్కువ, తుది ఉత్పత్తులపై తక్కువగా ఉన్న పన్నుల లోపాల్ని సరిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. పరిశ్రమ వర్గాలు మాత్రం దీనివల్ల ధరలు మరింత పెంచక తప్పదని పేర్కొన్నాయి. ముఖ్యంగా సింథటిక్ వస్త్రాలపై 5 శాతంగా ఉన్న జీఎస్‌టీని ఏకంగా 12 శాతానికి పెంచడాన్ని తప్పు పట్టింది. ఇప్పటికే ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవటంతో జనవరి నుంచి 12 నుంచి 15 శాతం ధరలు పెంచాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పెరిగిన జీఎస్‌టీతో ధరల పెంపు మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపాయి. సింథటిక్ వస్త్ర పరిశ్రమ మొత్తాన్ని ఒకే జీఎస్‌టీ రేటు పరిధిలోకి తీసుకురావడాన్ని నిపుణులు మాత్రం స్వాగతిస్తున్నారు. ఈ మార్పుతో భారతీయ సింథటిక్ వస్త్ర పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లోనూ పోటీపడేందుకు వీలవుతుందని చెప్పారు. మూడు రకాల జీఎస్‌టీ శ్లాబుల్లో ఉండడం పరిశ్రమ వర్గాలకూ పెద్ద చికాకుగా ఉంది. తాజాగా ఒకే జీఎస్‌టీ శ్లాబులోకి తీసుకురావడంతో ముడి పదార్దాలు, తుది ఉత్పత్తుల మధ్య పన్ను వ్యత్యాసం లేకుండా పోయింది. అయితే ధరలు తగ్గించిఓకే విధానం అమలు చేయకుండా పన్నులు మరింతగా పెంచడం దారుణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ధరలు పెరిగితే నలిగిపోయేది సామాన్య, మధ్య తరగతి ప్రజలే అన్న నిజాన్ని గుర్తించడం లేదు. జిఎస్టీ తీసుకుని వచ్చినపస్పుడు అతిపెద్ద ఆర్థిక సంస్కరణ అంటున్న ప్రధాని మోడీ దివంగత ప్రధాని పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలతో పోల్చుకోవాలి. ఆయన చేపట్టిన సంస్కరణలు ప్రజలకు ఎలా చేరగలిగాయో ఆలోచన చేయాలి. 18శాతం జిఎస్టీ కూడా అధికమని ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిది. ఇబ్బడి ముబ్బడిగా పన్నులు వసూలు చేసి ఓటుబ్యాంకు కోసం పథకాలు ప్రకటించి వాటికి ఖర్చు చేయడం మంచిది కాదు. పథకాలను పునరాలోచన చేయాలి. జిఎస్టీ ఆమోదించినప్పుడే వ్యక్తం అయిన అభ్యంత రాలను గమనించి పెద్దమొత్తంలో పన్నుల విధింపును ఆలోచన చేసివుంటే బాగుండేది. తొలుత వసూళ్లకు పాల్పడి, జిఎస్టీ తగ్గింపు వల్ల ఇప్పుడు ఇంతనష్టం వస్తోందని ప్రకటించడం కేవలం వ్యాపార ధోరణి తప్ప మరోటి కాదు. జనాగ్రహానికి కేంద్రం దిగొచ్చి జీఎస్టీ మంట నుంచి ఊరట కలిగించినా అది కూడా భారీ భారమే మోపుతోందని గుర్తించాలి. విలాస వస్తువులంటూ ఇప్పటిదాకా 28 శాతం పన్ను శ్లాబ్‌లో పడేసిన సౌందర్య సాధనాలు, ఫ్యాషన్ వస్తువులు, పేస్టులు, డిటర్జెరట్ల వంటి దైనందిన 178 వినియోగ వస్తువులపై జీఎస్టీ మండలి 18 శాతం శ్లాబ్‌లోకి తీసుకొచ్చింది. బంగారం ఆభరణాల కొనుగోళ్లపై 3 శాతం వసూళ్లు చేస్తున్నారు. ఇతరత్రా కేబుల,ఇంటర్నెట్ రంగాలపైకూడా 12శాతం వరకు వసూలు చేస్తున్నారు. అనేకానేక వసప్తువలుపై విధించిన జిఎస్టీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. అయితే జిఎస్టీ అమలు కోసం తొందరపాటు ప్రదర్శించిన సమయంలోనే దీనిపై సవాలక్ష అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నాయని విపక్షాలు గగ్గోలు పెడుతున్నా, వ్యాపారులు ఆందోళన చేస్తున్నా తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నచందంగా కేంద్ర సర్కార్ దూకుడుగా అమలు చేసింది. అనేక అంశాలపై ఆయా రాష్టాల్ర ప్రభుత్వాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసినా అవి చెల్లబాటు కాలేదు. కేంద్రం తెస్తున్న జీఎస్‌టీకి తాము వ్యతిరేకం కాదని, దాని అమలుకు కేంద్రం వ్యవహరిస్తున్న తీరే తమను ఆందోళనకు గురిచేస్తోందని పలు రాష్టాల్రు చెప్పినా ఫలితం లేకుండా పోయింది.కేవలం వ్యాపార ధోరణితో తీసుకున్న నిర్ణయం తప్ప పాలనా సంస్క రణ అనడానికి లేకుండా చేశారు. జిఎస్టీ తగ్గించి ప్రజలకు అనుగుణంగానిర్ణయాలు తీసుకోవాలి. కాబూలీ వాలా వడ్డీల్లా ఉన్న జిఎస్టీ శ్లాబులను త్తగించుకుంటే మోడీ మూల్యం చెల్లించక తప్పదు.