జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్

9999నల్గొండ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ జిల్లా కీలకంగా మారింది. ఇక్కడ తామే గెలుస్తామని అధికారపక్షం, కాంగ్రెస్ పక్షం పేర్కొంటోంది. ఆదివారం ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఓటర్ ఎవరూ కేంద్రానికి రాలేదు. మధ్యాహ్నం తరువాత ఓటు హక్కు వినిగించుకోవడానికి ఓటర్లు రానున్నారని తెలుస్తోంది. ఎన్నికకు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఏడుగురు డీఎస్పీలతో కేంద్ర సాయుధ బలగాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. వంద కిలోమీటర్ల దూరంలో వాహనాలను నిలిపివేశారు. ఓటర్లకు పాస్ లు ఉంటేనే ఓటర్లను పోలింగ్ కేంద్రం లోపలికి పంపిస్తున్నారు. మొత్తం జిల్లాలో 800 పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 1110 ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఐదు రెవెన్యూ డివిజన్ లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌పై అవగాహన లేని వారు సహాయకులను నియమించుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. ఈమేరకు నల్లగొండలో 65 మందికి సహాయకులను అనుమతించారు. వీరందరూ నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఓటు హక్కును వినియోంచుకోవాల్సి ఉంటుంది. నల్లగొండలో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ రెండు పార్టీల అభ్యర్థులు ఒకరిని మించి ఒకరు వ్యూహ ప్రతివ్యూహాలతో తలపడుతున్నారు.

మహబూబ్ నగర్ : ఓటర్లు 1,260 మంది..అభ్యర్థులు ఐదుగురు..స్థానాలు రెండు..ఇదీ ఎమ్మెల్సీ ఎన్నికల సూక్ష్మరూపం. ఒకటో ఓటుతో అధిక్యత సాధిస్తే ఒక అభ్యర్థి..అదే ఓటుతో అధిక్యత సాధించినా మరో అభ్యర్థి ఎన్నికకానున్నారు. అధిక్యత తగ్గితే ద్వితీయ ప్రాధాన్యత ఓటు పరిగణలోకి వస్తుంది. అందుకే ఓటర్లు తెలివిగా ఓటు వేయాల్సినవసరం ఉంది. పార్టీలు కూడా తమ తమ అభ్యర్థులను గెలిపించుకొనేందుకు ఓటర్లకు తర్ఫీదునిచ్చి మరీ రంగంలోకి దింపుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి పొరపాట్లు జరుగకుండా ఉండేందుకు పోలింగ్ సిబ్బందికి తగు శిక్షణనిచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాల ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
రెండు స్థానాల్లో ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారడంతో అన్ని పార్టీలు నిశితంగా దృష్టి సారించాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ, పుర వార్డు సభ్యుల ఓట్లతో పాటు ఎక్స్ అఫీషియో ఓట్లను సక్రమంగా వినియోగించుకొనేందుకు ప్రణాళికలు వేసుకున్నాయి. రెండు స్థానాల్లో జగదీశ్వర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలను గెలిపించుకొనేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తమ పార్టీ ఓట్లతో పాటు టిడిపి, బీజేపీ ఓటర్లు కూడా ప్రాధాన్య ఓటు వేస్తారని పేర్కొంటున్నారు. టిడిపి అభ్యర్థి కొత్తకోట దయాకర్ రెడ్డి సైతం కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి సహకారం లభిస్తుందని బీజేపీ ఓటు తోడై గెలిపిస్తుందని భావిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి జగదీశ్వర్ రెడ్డి కూడా రంగంలో ఉన్నారు.

రంగారెడ్డి : జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఆదివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 26 మంది పోలింగ్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి వచ్చిన జిల్లా ఎన్నికల పరిశీలకులు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.~ జిల్లాల్లో జరుగుతున్న రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. డాక్టర్ ఎ.చంద్రశేఖర్ (కాంగ్రెస్), పట్నం నరేందర్ రెడ్డి (టీఆర్ఎస్), బుక్క వేణుగోపాల్ (టిడిపి), సుంకరి రాజు (టీఆర్ఎస్), అశోక్ కొత్త (స్వతంత్ర). జిల్లాల్లో మొత్తం 771 మంది స్థానిక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 347 మంది ఉండగా, మహిళా ఓటర్లు 424 మంది ఉన్నారు. దీనితో మహిళా ఓటర్ల తీర్పే కీలకం కానుంది.

ఖమ్మం : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అధికార పార్టీ తరపున బాలసాని లక్ష్మీనారాయణ, సీపీఐ అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వరరావు, వైసీపీ అభ్యర్థిగా లింగాల కమల్ రాజ్ లు పోటీలో ఉన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. సీపీఐ అభ్యర్థిగా పోటీలో ఉన్న పువ్వాడ సీనియర్ నేత. పెద్దల సభకు మరోసారి అడుగుపెట్టాలన్న భావనతో సీపీఎం, కాంగ్రెస్, టి.టిడిపి ఆయనకు మద్దతినిస్తున్నాయి. జిల్లాలో ఎమ్మెల్సీ గెలుపు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో పార్టీల అధినేతల స్థాయిలోనూ చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 726 మంది ఓటర్లున్నారు. జిల్లా వ్యాప్తంగా 4 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 30వ తేదీన ఖమ్మంలో ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఖమ్మంలో…
ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఓటింగ్‌ కొనసాగుతోంది. జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లో 726 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ స్థానానికి ప్రధానంగా అధికార, విపక్ష అభ్యర్ధుల మధ్యే పోటీ ఉన్నట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్ : మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌ ప్రారంభమైంది. రెండు స్థానాలకు గానూ ఐదుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌, టీడీపీ నుంచి చెరో అభ్యర్థి చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌ మందకోడిగా సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీ జితేందర్‌ రెడ్డి తొలి ఓటును వినియోగించుకున్నారు. ఇక గద్వాల డివిజన్లో ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఎమ్మెల్యే డీకే అరుణ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నల్గొండ : జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము విజయం సాధించడం ఖాయమని టి.కాంగ్రెస్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కోమటిరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికను ప్రధాన ప్రతిపక్షం, విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ సందర్భంగా టెన్ టివితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. జిల్లాలో కేవలం 1110 ఓట్లు మాత్రమే ఉన్నాయని, 560 స్థానాలు టి.కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. టీఆర్ఎస్ కేవలం 136 స్థానాలకు పరిమితమైందని అందువల్ల పోటీ చేయడం కరెక్టు కాదన్నారు. తప్పకుండా మెజార్టీతో గెలవడంతో పాటు అనైతిక చర్యలను ఖండించడానికి తాము పోటీ చేయడి జరిగిందని కోమటిరెడ్డి పేర్కొన్నారు.