జిల్లాలో దళిత బంధు నల్గొండ

కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
జిల్లా కలెక్టర్
నల్గొండ బ్యూరో. జనం సాక్షి. రాష్ట్ర
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితుల ఆర్థికాభివృద్ధి కోసం రూపొందించిన దళిత బంధు కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని  జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు.
        శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఎం.పి.డి. ఓ.లు,నియోజక వర్గ ప్రత్యేక అధికారులు,వ్యవసాయ,పరిశ్రమల,పశు సంవర్థక,రవాణా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశం లో జిల్లా కలెక్టర్ దళిత బంధు పథకం కింద మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్ పై సమీక్షించారు. సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆరు నియోజక వర్గాల్లో,తుంగతుర్తి నియోజక వర్గం లోని శాలి గౌరారం మండలం కు సంబంధించి 517 మంది లబ్ధిదారులను ఎంపిక పూర్తి చేసి 10 లక్షల రూ లకు గాను ఒక్కొక్క లబ్ధి దారుని బ్యాంక్ ఖాతాలలో 9 లక్షల 90 వేల రూ.లు జమ చేసినట్లు తెలిపారు.10 వేల రూ.లు రక్షిత నీది కింద జమ చేయడం జరిగిందని,ప్రభుత్వం 10 వెలు రూ లు మ్యాచింగ్ గా అందజేస్తుందని అన్నారు.జిల్లాలో 517 మంది లబ్ది దారులకు యూనిట్ లు పూర్తి స్థాయి లో గ్రౌండింగ్  చేయాలని ఆదేశించారు. 17 మండలం లలో 20 గ్రామాలకు సంబందించి యూనిట్ లు గ్రౌండింగ్ ,పెండింగ్ యూనిట్ ల పై ఎం.పి.డి. ఓ.లను జిల్లా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకుని సూచనలు చేశారు.  దళిత బంధు పథకం కింద లబ్ధి పొందిన వారికి తాము ఎంచుకున్న యూనిట్ల గ్రౌండింగ్ చేసుకొని లాభదాయకంగా  ఆర్థికంగా ఎదిగేందుకు తగు సూచనలు,  సలహాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.దళిత బంధు కింద యూనిట్ లు మంజూరు అయిన గ్రామాలు ఎం.పి.డి. ఓ.లు,సంబంధిత శాఖల అధికారులు సందర్శించి యూనిట్ లు పెట్టుకున్న లబ్దిదారుల ఆర్థిక పరిస్థితిని గమనించి నెల నెల ఎంత ఆదాయం వస్తుంది విశ్లేషణ చేసి నివేదిక ఇవ్వాలని అన్నారు.దళిత బంధు అమలుపై రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు సమీక్షించడం జరుగుతుందని,ఎం.పి.డి. ఓ.లు,ఇతర జిల్లా అధికారులు వ్యక్తిగత శ్రద్ద వహించి లబ్దిదారులు ఆర్థికంగా లాభ పడేలా సూచనలు ఇవ్వాలని అన్నారు. లబ్ధిదారులు దళిత బందు కింద ఉపాధి పొందడమే కాకుండా లాభదాయకంగా తమ జీవనం మెరుగుపడేలా చూడాలన్నారు.గొర్రెలు, పశువుల యూనిట్లకు సంబంధించి షెడ్ ల నిర్మాణం పశువుల కొనుగోలు పూర్తి చేయాలని,వారికి పశు సంవర్టక శాఖ అధికారులు అవగాహన కలిగించాలని ఆయన తెలిపారు. ఉద్యానవన శాఖ నిబంధనల మేరకు దళిత బంధువులను గ్రౌండింగ్ చేయాలని సూచించారు. డైరీ ఫార్మ్స్ నెలకొల్పేందుకు లబ్ధిదారులు సూచించాలని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను  కూడా నెలకొల్పుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.
       ఈ సమీక్ష సమావేశంలో  డి.అర్.డి. ఓ కాళిందిని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశం,నియోజక వర్గ ప్రత్యేక అధికారులు గోపిరాం,రాజ్ కుమార్,రాజేందర్ రెడ్డి,ట్రాన్స్పోర్ట్ అధికారి సురేష్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారిని సంగీత లక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి సుచరిత,పరిశ్రమల శాఖ జి.యం. కోటేశ్వర్ రావు, పశు వైద్య శాఖ అధికారి డా.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
3 Attachments • Scanned by Gmail