జిల్లాలో పెరగనున్న ఓటర్ల సంఖ్య

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి):తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉండడంతో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 2018 జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటరు జాబి తాలో తమ పేర్లు నమోదు చేసుకొనే అవకాశం ఉంది. అక్టోబర్‌ 8న తుది జాబితాను విడుదల చేసి ఆ జాబితాలోని ఓటర్లే వచ్చే ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులుగా ఉంటారు. బూత్‌ల వారీగా ఓటర్ల మార్పులు, చేర్పుల్లో భాగంగా ఈ నెల 15, 16 తేదీల్లో ప్రత్యేక ప్రచారం నిర్వహించారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ లెవల్‌ అధికారులు ఓటరు జాబితాతో అందుబాటులో ఉన్నారు. స్థానికులు పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లి తమ పేర్లును చూసుకుని అవకాశం కల్పించారు. నమోదుపై కలెక్టర్‌ దివ్యఅధికారులు, రాజకీయ పార్టీ నాయకులతో సవిూక్ష నిర్వహించారు. సవరణ పక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. జాబితా నుంచి ఓటర్లను తొలగించేటప్పుడు సరిగా నిర్ధారించుకొని నోటీసులు జారీ చేయాలని సూచించారు. రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నా వారి పేరు ఒకే చోట ఉండేలా చూడాలని మరణించిన వారి పేర్లను సైతం జాబితా నుంచి తొలగించాలని వారు తెలిపారు.

తాజావార్తలు