జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మరింత గురుతర బాధ్యతను పెంచింది -బాణాల గోవర్ధన్

 

కురివి సెప్టెంబర్-5 (జనం సాక్షి న్యూస్)

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బాణాల గోవర్ధన్ తాట్య తండా గ్రామ పరిధిలోని పిల్లగుండ్ల తండా ఎంపిపిఎస్ ప్రభుత్వ పాఠశాల లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న బాణాల గోవర్ధన్ కు సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలో రాష్ట్ర గిరిజన,స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, మానుకోట ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ ,జిల్లా కలెక్టర్ శాశంక, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినయ్, జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, డిఇఓ అబ్దుల్ హై వారి చేతులమీదుగా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును తీసుకోవడం సంతోషాన్ని కలిగించడంతోపాటు భవిష్యత్తులో మరింత గురుతర బాధ్యతను పెంచిందన్నారు. విద్య ఉపాధ్యాయ రంగంలో విశేష కృషి విశిష్ట సేవాలందించిన వారికి అవార్డులు ప్రధానం చేస్తారన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఎన్రోల్మెంట్ పెంచడంతోపాటు, విస్తృత స్థాయిలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం లాక్ డౌన్ పీరియల్లో జూమ్ ఆప్ ద్వారా ఆన్లైన్ బోధనా చేయడం, సరికొత్త ఆలోచనలతో ద్విచక్ర వాహనంపై మైకు ద్వారా బడిబాట కార్యక్రమం నిర్వహించడం, పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన వంటి పలు విషయాలలో కృషి చేసినందుకు తనకు ఈ అవార్డు లభించింది అన్నారు. జిల్లా,మండల కమిటీ పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు,గ్రామ ప్రజలకు,ముఖ్యంగా వారి సతీమణికి అభినందనలు తెలిపారు.