జిల్లా ఏర్పాటు ఉద్యమంలో ఆగ్రభాగాన ఉంటాం…

మిర్యాలగూడ, జనం సాక్షి
ప్రతిన భూనిన మినా ఇంజనీరింగ్ విద్యార్థినీలు..
మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యములో ఆగ్రభాగాన ఉండి జిల్లాను సాధించుకుంటామని మిర్యాలగూడలోని మినా ఇంజనీరింగ్ మహిళా కళాశాల విద్యార్థినిలు పేర్కొన్నారు.శుక్రవారం మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కళాశాలలో జిల్లా ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో పలువురు విద్యార్థినీలు మాట్లాడారు.జిల్లా ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాల గురించి సాధన సమితి నాయకులు అవగాహనా కల్పించారు. జిల్లా పరిధిలో నియామకం అయ్యే పోస్టుల్లో 95% స్థానికులకు ఇస్తారన్నారు. పోలీస్, గ్రూప్-4 పోస్టులు జిల్లా వారికే చెందుతాయన్నారు. స్థానిక నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. జిల్లా ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమంలో ఇంజనీరింగ్ విద్యార్థినిలు పాల్గొనలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ఏర్పాటు ఉద్యమంలో పాల్గొంటామని ప్రతిజ్ఞ చేసారు.కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థినిలు పాల్గొన్నారు. కార్యక్రమంలో సాధన సమితి నాయకులు చేగొండి మురళి యాదవ్,జ్వాలా వెంకటేశ్వర్లు,బంటు కవిత,ప్రిన్సిపాల్ ఎస్ కే షాజీ, వైస్ ప్రిన్సిపల్ బడే సాహెబ్, రమేష్,వాణి తదితరులు పాల్గొన్నారు.