జిల్లా ఏర్పాటు ఉద్యమానికి న్యాయవాదుల సంఘీభావం..!

మిర్యాలగూడ. జనం సాక్షి
మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ కొనసాగుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా శనివారం మిర్యాలగూడ కోర్టులో ఆవరణలో మిర్యాలగూడ బార్ అసోసియేషన్ ప్రతినిధులను మిర్యాలగూడ జిల్లా సాధన సమితి సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య మాట్లాడుతూ మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి పూర్తి మద్దతు సంఘీభావం తెలుపుతున్నట్లు తెలిపారు. జిల్లా ఏర్పాటు ఉద్యమంలో న్యాయవాదులు భాగస్వాములవుతారని పేర్కొన్నారు. మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుతో జిల్లాస్థాయి న్యాయస్థానాలు ఇక్కడ ఏర్పాటు చేయబడతాయన్నారు. అన్నిరకాల సౌకర్యాలు వ్యయప్రయాసలు తగ్గుతాయని చెప్పారు. కొత్త జిల్లాల పునర్విభజన సమయంలోనే మిర్యాలగూడకు అన్యాయం జరిగిందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మిర్యాలగూడను జిల్లాగా చేయాలని కోరారు. న్యాయవాదుల మహిళా ప్రతినిధి భవాని, న్యాయవాదులు నేతి సత్యనారాయణ, పరమేష్, గూడూరు శ్రీనివాస్,ఆర్ సతీష్, కరణం లింగయ్య, ఉమా శంకర్ రెడ్డి,రాజ్ కుమార్ రెడ్డి, ఎస్ ఆర్ కె ప్రభాకర్, కంది బండ శ్రీనివాస్,కామేశ్వర్ రెడ్డి సాయికుమార్ బట్టు వెంకన్న, తాళ్లపల్లి రాములు మిర్యాలగూడ జిల్లా సాధన సమితి కన్వీనర్ కో కన్వీనర్, డాక్టర్ జాడి రాజు,మాలోతు దశరధ నాయక్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, బిసి సంఘం పట్టణ అధ్యక్షుడు బట్టు వెంకటేశ్వర్లు సామాజిక తెలంగాణ ప్రధాన కార్యదర్శి జయరాజు యాదవ సంఘం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు చిమట ఎర్రయ్య చేగొండి మురళి యాదవ్, ఎంఐఎం నాయకులు ఫరూక్, బీఎంపీ నాయకులు మోసినలి, చిన్న రాజు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు