జిల్లా జడ్పీ చైర్మన్ బాలాజీ సింగ్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన నాగర్ కర్నూల్ తెలంగాణ జాగృతి శాఖ
గురువారం తెలంగాణ జాగృతి నాగర్ కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి జడ్పీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఠాకూర్ బాలాజీ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిసి చైర్మన్ బాధ్యతలు చేపట్టినందుకు గాను తెలంగాణ జాగృతి తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ మిర్యాల పావని ,తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్/ టిఆర్ఎస్వి మండల అధ్యక్షుడు దారమోని గణేష్, తెలంగాణ జాగృతి సభ్యులు వసంత ,రాజు నాయక్ ,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.