జిల్లా బీసీ బిడ్డకు దక్కిన అరుదైన గౌరవం.
టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య
గూడూరి అభినందించిన టిఆర్ఎస్ శ్రేణులు.
రాజన్నసిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 13.(జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర పవర్ లుమ్ టెక్స్ టైల్ కార్పొరేషన్ చైర్మన్ గా గూడురి ప్రవీణ్ ఎన్నిక కావడం రాజన్న సిరిసిల్ల జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నాడు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి తో పాటు పలువురు నాయకులు గూడూరి ప్రవీణ్ అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలిసారిగా రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ గా సిరిసిల్లకు చెందిన చేనేత బిడ్డకు అవకాశం కల్పించడం పట్ల సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. చేనేత సమస్యల పట్ల అవగాహన ఉన్న గూడూరు ప్రవీణ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నిక కావడం వల్ల అన్ని శ్రేణులకు ప్రయోజనాలు అంది అవకాశం ఉందని అన్నారు. రాష్ట్ర పవర్ లుం టెక్స్ టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ లకు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సిరిసిల్ల కాటన్ పరిశ్రమ తో పాటు టెక్స్ టైల్ రంగంలోని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.. గూడూరు ప్రవీణ్ కు చైర్మన్ గా బాధ్యతలు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టిఆర్ఎస్ పేర్లు సంబరాలు నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నరసయ్య, సీనియర్ నాయకులు భోల్లి రామ్మోహన్, కమిరే సంజీవ్ గౌడ్, మ్యాన రవి తదితరులు పాల్గొన్నారు.