జిల్లా యువజనోత్సవాలు నిర్వాహణ

జ్యోతిని వెలిగించిన జిల్లా కలెక్టర్‌ దినకర్‌బాబు

సంగారెడ్డి, నవంబర్‌ 8  యువతలో వివిధ రంగాలలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు జిల్లా యువజనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎ.దినకర్‌బాబు తెలిపారు. గురువారం జిల్లా విద్యాధికారి కార్యాలయ ఆడిటోరియంలో జరిగిన జిల్లా యువజనోత్సవాలను జిల్లా కలెక్టర్‌ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఎంపికైన కళాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపడం జరుగుతందని, అదేవిధంగా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానములో నిలిచిన వారికి జాతీయ స్థాయి పోటీలకు పంపడం జరగుతుందని, జాతీయస్థాయిలో గెలుపొందిన వారికి జాతీయ యువజనోత్సవాల పురస్కారాలు అందజేయడం జరుగుతందని ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న యువత ఆత్మస్థైర్యంతో పట్టుదల వదలకుండా ప్రయత్నం చేసినటైతే విజయం చేకూరుతుందనే వివేకానుందుని స్పూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఆయన తెలిపారు. ఇందులో కూచిపూడి, ఫోక్‌ సాంగ్స్‌, ఫోక్‌ డాన్స్‌, కర్ణాటక వోకల్‌, వకృత్వ పోటీలు, ఏకాంకిత మృధంగం, ఫ్లూట్‌, వీణా, సితారా, టబలా, గిటార్‌ హార్మోనియం తదితర అంశాలలో 15-35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతకు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా యువజన సంక్షేమ శాఖాధికారి అంజనేయశర్మ మాట్లాడుతూ వివేకానందుని జన్మదినాన్ని పురస్కరించుకొని యువజనోత్సవాలు నిర్వహించడం జరగుతుందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్‌, ఆర్వీఎం పి.ఓ. సీతారామారావు, జిల్లా స్పోర్ట్స్‌ అధికారి హారినాథ్‌, వికలాంగుల సంక్షేమ శాఖ ఎ.డి. లక్ష్మణాచారి, డి.పి.ఆర్‌.ఓ. డి.నాగార్జున్‌, కలెక్టరేట్‌ పరిపాలనాధికారి నరేష్‌, జిల్లా యువజన సంఘాల సంక్షేమ సమితి అధ్యక్షులు కూన వేణుగోపాల్‌, కళాకారులు మల్లేశం, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.