జిల్లా లో ఉన్న క్లినిక్ లను తనిఖీ చేసిన ములుగు వైద్యాధికారి డా.అల్లం అప్పయ్య
రెండు టీం గా జిల్లాలోని మొత్తం క్లినిక్ లను తనఖీ….
రిజిస్ట్రేషన్ తప్పనిసరి..పలు హెచ్చరికలు జారీచేసిన ములుగు వైద్యాధికారి డా.అల్లం అప్పయ్య
ములుగు బ్యూరో,సెప్టెంబర్28(జనం సాక్షి):-
బుధవారం రోజున ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మరియు కుటుంబ సంక్షేమము ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ ఆక్ట్ 2020 దాని పై జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు తనిఖీ కార్యక్రమము చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆసుపత్రులు,క్లినిక్లు ,కన్సల్టేషన్ రూమ్స్,పాలి క్లినిక్లు ,ఫిజియోథెరపీ,డెంటల్ హాస్పటల్, క్లినిక్లు డయాగ్నొస్టిక్ సెంటర్స్ మొదలగు వాటి తనిఖీ కొరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గారు బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.ఇందులో డాక్టర్ అప్పయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఒక బృందముగా మరియు డాక్టర్ విపిన్ డిప్యూటీ డిఎంహెచ్ఓ మరియు డాక్టర్ పి. రవీందర్ ఒక బృందంగా మరియు డాక్టర్ కే. క్రాంతి కుమార్ డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ ఐటీడీఏ ఏటూర్ నాగారం మరియు డాక్టర్ ఎంకటేశ్వరరావు మరియు సిబ్బందితో మూడు బృందాలుగా ఏర్పడి జిల్లాలోని కేటాయించిన మండలాలు లోగల ఆసుపత్రులను తనిఖీ నిర్వహించడం జరిగింది.బుధవారం మొత్తము 13 క్లినిక్స్ మరియు ఆసుపత్రులను తనిఖీ చేయడం జరిగింది.పసర లోని లక్ష్మీ ప్రసన్న మెడికల్ అండ్ జనరల్ స్టోర్ పదమ చికిత్స కేంద్రము శ్రీ రామకృష్ణ క్లినిక్ ఏం ఫణీంద్ర చారి ప్రాథమిక చికిత్స,శ్రీ సూర్య క్లినిక్ పసర రాజేష్ క్లినిక్ పసర,శ్రీ వెంకటేశ్వర క్లినిక్ పసర,శ్రీనివాస క్లినిక్ పసర,శ్రీ చక్ర హాస్పిటల్, భవ్య శ్రీ మెడికల్ స్టోర్ ప్రధమ చికిత్స కేంద్రము చల్వాయి,ఏటూరునాగారం లోని బన్ను హాస్పిటల్, స్రవంతి హాస్పిటల్, ఆర్యవ్రత్ క్లినిక్ రామన్నగూడెం రోడ్డు ఏటూరు నాగారం,గణేష్ క్లినిక్ ఏటూరు నాగారం,శ్రీ లక్ష్మీ సాయి క్లినిక్ ఏటూరు నాగారం,వీటిని తనిఖీ నిర్వహించడం జరిగింది. వీటిలో ముందు రిజిస్ట్రేషన్ గురించి తనిఖీ చేయడం జరిగింది.రిజిస్ట్రేషన్ లేకుండా నడిపే ఆసుపత్రులకు నోటీసులు ఇవ్వడం జరిగింది.ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ కలిగి ఉండి వైద్యులు అర్హత కలిగి ఉన్నారా స్టాఫ్ సిబ్బంది అర్హత కలిగి ఉన్నారా,ఫైర్ యాక్సిడెంట్ నిరోధము ఏర్పాటు ఉందా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనుమతి ఉందా ,బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సౌకర్యం కలిగి ఉన్నారా ,మొదలగు వాటిపై అవుట్ పేషెంట్ రిజిస్టర్ ఇన్ పేషెంట్ రిజిస్టర్ మొదలగు వాటిని తనిఖీ చేసి లేనివారికి నోటీసులు ఇవ్వడం జరిగింది.తనిఖీలకు సహకరించకుండా మూసివేసిన క్లినికులకు నోటీసులు వారి క్లినిక్ గోడలకు అందించడం జరిగింది.ఈ యొక్క తనిఖీలను ఉద్దేశించి జిల్లా వైద్యాదికారి అప్పయ్య మాట్లాడుతూ జిల్లాలో రిజిస్ట్రేషన్ లేకుండా ఆస్పత్రులను నడపడం చేయకూడదు.వెంటనే మీరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు.ఆస్పత్రులలో ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ 20 20 ప్రకారం పాటించాలని లేనిపక్షంలో చట్ట ప్రకారము వారు జరిమానాలకు శిక్షలకు గురవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డెమో తిరుపతి,సిహెచ్ఓ దుర్గారావు గారు హెచ్ ఈ సంపత్ భాస్కర్,ఇన్స్పెక్షన్ టీం లో తదితరులు పాల్గొన్నారు.