జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో విద్యార్థుల ప్రతభ

నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన “జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ 2022” లో విజయ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొని వివిధ విభాగాలలో బహుమతులు గెలుపొందారు. “నిత్యం జీవితంలో గణితం” అనే విభాగంలో ఏ.లాస్య శ్రీ 8వ తరగతి విద్యార్థిని జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతిని గెలుపొంది రాష్ట్రస్థాయికి ఎన్నికయింది.  జె.గజేందర్ గారు గైడ్ టీచర్ గా వ్యవహరించారు. సైన్స్ ఫెయిర్ భాగంలో నిర్వహించిన “కళా ఉత్సవ్ 2022” లో భాగంగా తబలా వాయిద్యంలో 10వ తరగతి చదువుతున్న శ్రీ గాయత్రి జిల్లా ప్రథమ బహుమతిని సొంతం చేసుకోంది. అలాగే సాంస్కృతిక  కార్యక్రమంలో భాగంగా శాస్త్రీయ నృత్యంలో సోలో విభాగంలో 9వ తరగతి చదువుతున్న కీర్తిశ్రీ మొదటి బహుమతిని పొందింది. అలాగే గ్రూప్ డాన్స్ లో త్రిష అండ్ గ్రూప్ విజయ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు అందరిని అలరించి ప్రోత్సాహక బహుమతిని పొందారు. వివిధ విభాగాల్లో బహుమతులు పొందిన విద్యార్థిని విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ మంచిరాల నాగభూషణం , ప్రిన్సిపల్ సామ మోహన్ రెడ్డి  ఇన్చార్జి టీచర్స్ రవికుమార్ , సుస్మిత లు వారిని సత్కరించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని వారిని అభినందించారు.