జీపు చెట్టును ఢీకొని ముగ్గురు మృతి
మెదక్ : ఆందోల్ మండలం దానంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మంది మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది.