జూన్‌ 1నుంచి నీటి విడుదల

ఏలూరు,మే26(జ‌నంసాక్షి):రైతులు మూడు పంటల సాగు ద్వారా రెట్టింపు ఆదాయం పొందేందుకు

ముందస్తు సాగు చేపట్టాలనివ్యవసాయాధికారి సూచించారు. ముందస్తు సార్వా సాగుపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం జూన్‌ 1వ తేదీ కాలువలకు నీటిని విడుదల చేస్తుందన్నారు. రైతులు జూన్‌ మొదటివారంలో నారుమళ్ల పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. మార్చి నెలాఖరుకు రెండో పంట కోతలు పూర్తి చేసుకుని మూడో పంటకు సిద్ధం కావాలని కోరారు. ఇదే క్రమంలో వ్యవసాయశాఖ రైతులకు అమ్మకానికి నాణ్యమైన విత్తనాలు సిద్ధం చేసిందని చెప్పారు. భూసార పరీక్ష ఫలితాలను అందజేసే పక్రియ వేగంగా కొనసాగుతుందన్నారు. జింకు లోపాన్ని సవరించేందుకు జిప్సం పూర్తి రాయితీపై అందజేస్తుందన్నారు. రైతులు భూసార పరీక్షలకు అనుగుణంగా, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మాత్రమే ఎరువులు వాడి దుబారా తగ్గిం చుకోవచ్చునని, అధిక దిగుబడులు సాధించవచ్చని అన్నారు. ముందుస్తు సాగువల్ల రైతులు ప్రకతి వైపరీత్యాల బారిన పడకుండా పంటలను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు.