జూలూరుపాడులో ఫ్రీడం ర్యాలీ విజయవంతం
జూలూరుపాడు, ఆగష్టు 13, జనంసాక్షి:
స్వతంత్ర భారత వజోత్సవాలను పురస్కరించుకొని జూలూరుపాడు మండల కేంద్రంలో సెయింట్ ఆన్స్ స్కూల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు శనివారం నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ కార్యక్రమం విజయవంతం అయింది. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల విశిష్టతను చాటేలా ఉదయం 8 గంటల సమయానికే అధిక సంఖ్యలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్చందంగా హాజరై ఫ్రీడం ర్యాలీలో భాగస్వాములయ్యారు. గుండెల నిండా దేశ భక్తిని నింపుకుని విద్యార్థులు, యువతీ, యువకులు నిర్వహించిన ర్యాలీ జాతీయ సమైక్యతకు అద్దం పట్టింది. ముందుగా సెయింట్ ఆన్స్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులు స్వాతంత్ర్య పోరాటం, మహనీయుల త్యాగాల గురించి విద్యార్థులకు వివరించారు. సెయింట్ ఆన్స్ స్కూల్ వద్ద ఫ్రీడం ర్యాలీని ఎంపిపి లావుడ్యా సోని ప్రారంభించారు. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ఆటో యూనియన్ నాయకులు, ప్రజలు మువ్వన్నెల జెండాను చేత పట్టుకుని ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చండ్రుగొండ క్రాస్ రోడ్డు వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లూధర్ విల్సన్, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, ఎండీవో తాళ్లూరి రవి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాదరావు, ఎంఈవో వెంకట్, ఎంపీవో రామారావు, గిర్దావర్ తిరుపతి, రెవిన్యూ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మాచినేనిపేట తండా సర్పంచ్ లకావత్ భారతి, జూలూరుపాడు సర్పంచ్ గుండెపిన్ని విజయ, వినోభానగర్ సర్పంచ్ భూక్యా పద్మ, వెంగన్నపాలెం సర్పంచ్ గలిగె సావిత్రి, బేతాళపాడు సర్పంచ్ గుగులోతు రాందాస్, చింతలతండా సర్పంచ్ భూక్యా రాములు, జూలూరుపాడు ఎంపిటిసి పెండ్యాల రాజశేఖర్, కాకర్ల ఎంపిటిసి పొన్నెకంటి సతీష్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, లకావత్ గిరిబాబు, రోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, మండల అధ్యక్ష, కార్యదర్శులు చౌడం నరసింహారావు, నున్న రంగారావు, యల్లంకి చిన్న నాగేశ్వరరావు, పణితి వెంకటేశ్వర్లు, సుభానీ, ఇల్లంగి తిరుపతి, బుడిపుడి ప్రభాకర్, గలిగె చంటి, బాదావత్ లక్ష్మణ్, మోదుగు రామకృష్ణ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి యాసా నరేష్ పలు రాజకీయ పార్టీల నాయకులు, అంగన్వాడీ, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.