జెయింట్‌ వీల్‌ నుంచి పడి ఎయిర్‌హోస్టెన్‌ మృతి

చైన్నై: జెయింట్‌ వీల్‌ నుంచి కింద పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన చైన్నైలో చోటుచేసుకుంది.కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థలో ఎయిర్‌హోస్టేన్‌గా పనిచేస్తున్న ఆఫిమాక్‌ అనే మహిళ నగర శివారులోని ఈవీపీ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లోని భారీ జాయింట్‌ వీల్‌ ఎక్కింది. అయితే ఆమె కిందపడటంతో తలకు  తీవ్ర గాయాలయ్యాయి. సిబ్బంది ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి పార్క్‌ మేనేజర్‌, ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.