జైలునుంచి విమలక్క విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ కో -కన్వీనర్‌ విమలక్క చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. పుప్పాలగూడ వద్ద టోల్‌ప్లాజాపై దాడి కేసులో గత 75 రోజులు జైల్లో ఉన్న విమలక్కకు రాజేంద్రనగర్‌ కోర్టు నిన్న బెయిల్‌ మంజూరు చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఉద్యమకారులను అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఆటపాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పారు. రేపు జేఏసీ తల పెట్టిన బంద్‌కు  ఆమె సంఘీభావం తెలిపారు.

తాజావార్తలు