జైలు నుంచి జీవిత ఖైదీ పరారీ
సంగారెడ్డి అర్బన్: మెదక్‌జిల్లాలోని కంది జైలు నుంచి యాదగిరి అనే జీవిత ఖైదీ బుధవారం పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. హత్య కేసులో కొంతకాలం చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించిన యాదగిరిని.. 2015 జులై 15న కంది జైలుకు తరలించారు. మరో రెండు నెలల్లో అతని శిక్ష కాలం పూర్తికానుంది. బుధవారం ఉదయం కంది జైలులో తోటపని చేస్తున్న సమయంలో యాదగిరి పరారయ్యాడు. అతని స్వస్థలం తూప్రాన్ మండలంలోని గుండ్రేటి పల్లి. పరారైన ఖైదీ కోసం నాలుగు పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.