జోగినాథుడి జాతర ప్రారంభం

జోగిపేట: స్థానిక శ్రీ జోగినాథస్వామి జాతర సోమవారం ప్రారంభమయ్యాయి.వారం రోజుల పాటు జరిగే ఉత్సావాల్లో భాగంగా మొదటి రోజున ఉదయం స్వామి విగ్రహనికి గరుడ గంగా స్నానం చేయించారు.సాయంత్రం ఆలయంలోని జంట శివలింగాలకు అలయ పూజారులు పసుపు,పూలమాలలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పల్లకిలో ఉంచి పట్టణంలోని పుర వీధుల్లో వూరేగింపు నిర్వహించారు.స్వామి వారిని దర్శించుకోవడానికి పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్బంగా ఆలయ పరిధిలోని చెట్లకు వివిధ రంగుల్లో విద్యుత్‌ దీపాలతో తీర్చిదిద్దారు.