జోనల్ మీట్ కబడ్డీ క్రీడలో ఇనుగుర్తి క్రీడాకారులు ద్వితీయ స్థానం కైవసం
అభినందించిన ప్రిన్సిపాల్ విజయలలిత
కేసముద్రం సెప్టెంబర్ 28 జనం సాక్షి / సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల పరిధిలో అండర్ 17 జోనల్ మీట్ రాయపర్తి లో ఈ నెల 25 నుండి 27 వరకు 3 రోజులు నిర్వహించిన క్రీడా పోటీల్లో కబడ్డీ క్రీడలో సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల ఇనుగుర్తి విద్యార్థి క్రీడాకారులు ద్వితీయ స్థానాన్ని గెలుపొందారు.వీరికి బహుమతులు ఆర్ సి ఓ విద్యా రాణి (వరంగల్) చేతుల మీదుగా అందజేశారు.క్రీడాకారుల వెంట క్రీడలను ప్రోత్సహించిన పిడి కవిత,పి ఈ టి మహేశ్వరి, ఎస్కార్ట్ టీచర్స్ స్వప్న,వెంకమ్మ ఉన్నారు.ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన కబడ్డీ క్రీడాకారులు ఇ.వెన్నెల,బి.సంగీత ,బి.రాజశ్రీ,ఎం.తేజశ్రీ,కె. అనూష, డీ.దివ్య, డి.సిరివల్లి లను ప్రిన్సిపాల్ విజయ లలిత మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.
Attachments area