జోరుగా నకిలీ క్రిమిసంహారక మందులు,
బయో మందుల పేరిట భారీ దోపిడీ,
* రైతులను నట్టేట ముంచుతున్న ప్రైవేట్ వ్యాపారులు,
* షాపుల్లో కనిపించని స్టాక్ బోర్డులు,
* వ్యాపారులతో కుమ్మక్కయిన అధికారులు,
ఖానాపురం అక్టోబర్15 జనం సాక్షి
నకిలీ క్రిమిసంహారక మందులతో ప్రైవేటు వ్యాపారులు రైతులను నట్టేట ముంచుతున్నారు. పలు ప్రాంతాల్లో నిషేధించిన క్రిమిసంహారక మందులను విచ్చలవిడిగా బహిరంగంగా విక్రయాలు జరుపుతున్నారు. వ్యవసాయ అధికారులు క్రిమిసంహారక మందుల వ్యాపారుల తో కుమ్మక్కై నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అమాయక రైతులను ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేటు వ్యాపారులు అరువు పేరుతో రైతులకు అధిక ధరలకు క్రిమిసంహారక మందులువిక్రయాలు చేపడుతున్నారు. రైతులకు మందులు కొనుగోలు చేసినప్పుడు రైతులకు బిల్లులు ఇవ్వకుండా వ్యాపారులు డైరీలో రాసుకుని విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. నకిలీ క్రిమిసంహారక మందులను అరి కట్టవలసిన వ్యవసాయ శాఖ అధికారులు వ్యాపారులకు డీలర్లకు డిస్ట్రిబ్యూటర్లకు వత్తాసు పలుకుతున్నారు.అనే ఆరోపణలు మండల వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. వ్యాపారులు మార్కెట్లో ప్రతి దుకాణంలో క్రిమిసంహారక మందుల వివరాలు బోర్డులో ధరల వివరాలు స్టాక్ వివరాలు పొందుపరిచి ఉండాలి కానీ అవి ఏమి పెట్టకుండా ఇష్టానుసారంగా విక్రయాలు జరుపుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే మండల వ్యాప్తంగా క్రిమిసంహారక మందుల విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మార్కెట్లో దొరికే క్రిమిసంహారక మందులు అసలు ఏ ఓ నకిలీవో తెలియక రైతులు లబోదిబోమంటున్నారు. ఇటువంటి లైసెన్సు లేకుండానే గ్రామంలో విక్రయాలు చేపడుతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు కళ్ళు తెరిచి నాణ్యమైన క్రిమిసంహారక మందులు విక్రయాలు జరిపేందుకు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.
Attachments area