జోరు వానలో సైతం ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
వరంగల్ ఈస్ట్, జూలై 24 (జనం సాక్షి)మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అంటే ఎమ్మెల్యే నరేందర్ కు ఎనలేని అభిమానం కేటీఆర్ జన్మదినం అంటే ఓరుగల్లు తూర్పులో ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా పండగే తెలంగాణా అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్న సబ్బండ వర్గాల జననేత మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో ఈసారి మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా సాగాయి ముందుగా అనుకున్నట్టుగా బ్రహ్మాండమైన లైటింగ్ ఏర్పాట్లు మొదలు పెట్టిన వర్షం అంతరాయం కలిగించినప్పటికి ఎమ్మెల్యే నరందేర్ తగ్గేదేలే అంటూ జోరు వర్షంలో డీజె మోతలతో,రామన్న పాటలు,కళాకారుల నృత్యాలతో ఓసిటీ మైదానం హోరెత్తించారు
వర్షమే రానియ్యి పిడుగులే పడనియ్యి తన అభిమానాన్ని చూపించడంలో తగ్గేదేలే అంటూ ఎమ్మెల్యే నన్నపునేని జోరు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కళాకారులు,అభిమానులతో చిందేశారు.అర్ధరాత్రి 12గంటలకు బాణసంచా మోతలతో ఓసిటీ మైదానం హోరెత్తింది అదే జోరు వర్షంలో కార్పొరేటర్లు,అభిమానులు,కార్యకర్తల నడుమ భారీ కేక్ ను కట్ చేసి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపి ఎమ్మెల్యే నరేందర్ తన అభిమానాన్ని చాటుకున్నారు.