. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలి
బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపీ
నర్సాపూర్. సెప్టెంబర్, 20 , ( జనం సాక్షి ) :
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపీ అన్నారు. మంగళవారం నాడు నర్సాపూర్ పట్టణంలో బీజేపీ, ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా ముదిరాజ్ జర్నలిస్టు ల సంఘం అధ్యక్షుడు గణేష్ ముదిరాజ్‌కు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మనించారు. అనంతరం బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపీ, నర్సాపూర్ మాజీ ఎంపీపీ రమణారావు, మాజీ జడ్పీటీసీ మాధవి జగదీశ్‌లు మాట్లాడుతూ నర్సాపూర్ పట్టణానికి చెందిన గణేష్ జిల్లా ముదిరాజ్ జర్నలిస్టు ల సంఘం అధ్యక్షుడిగా అభినందనీయమని అన్నారు. జర్నలిస్టుల కోసం పనిచేసి మరిన్ని పదవులు అధిరోహించాలని అన్నారు. ఈకార్యక్రమంలో గౌడ సంఘము రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, కౌన్సిలర్లు సురేష్, రాజేందర్, సినియర్ నాయకులు రఘువీరారెడ్డి, రమేష్ గౌడ్, శ్రీనివాస్ గుప్తా, గుండం శంకర్ ,అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ,ముదిరాజ్ సంఘం నాయకులు దండు దశరథ, హన్మంతు శ్రీనివాస్, జనుము నర్సింలు, ఎల్లపురం శ్రీనివాస్, శ్రీశేలం యాదవ్, భీమేష్. గోవర్ధన్ రెడ్డి, కోండి దుర్గేష్, మల్లేష్ యాదవ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.