టర్కీలో ఆత్మాహుతి దాడి

2

– నలుగురు పోలీసులకు గాయాలు

టర్కీ నవంబర్‌ 15 (జనంసాక్షి):

పారిస్‌లో జరిగిన దాడిని మరవక ముందే టర్కీలో ఉగ్రవాదులు మళ్లీ దాడికి పాల్పడ్డారు. ఈ రోజు ఉగ్రవాదులు టర్కీలో చేసిన ఆత్మాహుతి దాడిలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. స్ధానికంగా ఉన్న గాజియన్‌టెవ్‌ ¬టల్‌ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి బాంబులు తగిలించుకుని పేల్చుకున్నాడు. టర్కీలో ఈ రోజు జీ-20 సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉగ్రవాదంపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు దాడి చేయడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఈ సదస్సులో పాల్గొనడానికి భారత ప్రధాని మోడి, అమెరికా అధ్యక్షుడు ఒబామా, పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు టర్కీ చేరుకున్నారు. ఈ జీ-20 సదస్సు జరిగే వేదిక దగ్గరే బాంబు దాడి జరగడంతో టర్కీ పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. పారిస్‌లో దాడి జరిగినప్పుడు కూడా అక్కడ ఓ సమావేశం జరిగింది.