టర్కీ బయలుదేరిన ప్రధాని
– అంబేడ్కర్‌కు ఘన నివాళి
లండన్,నవంబర్14(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల బ్రిటన్ పర్యటన ముగిసింది. దీంతో జీ 20 సదస్సులో పాల్గొనేందుకు ఆయన టర్కీకి బయలుదేరారు. ఆ దేశ రాజధాని అంకారాలో ఆదివారం జరగనున్న ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రిటన్ ప్రధాన మంత్రి కెమెరాన్, జర్మనీ ఛాన్స్‌లర్ మార్కెల్ , చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తదితరులు పాల్గోనున్నారు. పారిస్‌లో ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ ¬లాండే హాజరుకావడం లేదు. జీ 20 సదస్సలో ప్రధానంగా ఉగ్రవాదం, సిరియా సంక్షోభం, గ్లోబల్ వార్మింగ్‌పై చర్చించే అవకాశముంది.