టిఆర్ఎస్ దెబ్బకు బిజెపీ ఎత్తుగడలు చిత్తు

టిఆర్ఎస్ దెబ్బకు బిజెపి వేసిన ఎత్తుగడలు,పన్నిన వ్యూహాలు చిత్తయ్యాయని టిఆర్ఎస్ పార్టీ దౌల్తాబాద్ పట్టణ అధ్యక్షుడు అజ్మత్ అలీ (అజ్జు) అన్నారు. మండలంలోని దౌల్తాబాద్ గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మునుగోడులో విజయం సాధించేందుకు  బిజెపి నాయకులు వేసిన పాచికలు,పన్నిన వ్యూహ ప్రతివ్యూహాలు బెడిసి కొట్టాయని వారన్నారు.బిజెపి ఎత్తుగడలను చిత్తు చేస్తూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ అనూహ్యమైన మెజారిటీతో సాధించిన విజయం బిజెపి నాయకులకు చెంపపెట్టు లాంటిదని ఆయన తెలిపారు.సర్వ శక్తులు ఒడ్డుతూ మునుగోడు ప్రజలను ఆకర్షించడానికి బిజెపి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని వారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలను,అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా చేపడుతున్న టిఆర్ఎస్ పార్టీకి మునుగోడు ప్రజలు పట్టం కట్టారని వారు తెలిపారు.