టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జన్మదిన వేడుకలు.
– గోపిరెడ్డి రమణారెడ్డి దంపతులకు గజమాలతో సత్కారం…
బూర్గంపహాడ్ అక్టోబర్ 01 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం టి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి పుట్టినరోజు వేడుకలు సారపాకలో ఆ పార్టీ శ్రేణులు ఆయన స్వగృహం నందు ఘనంగా నిర్వహించారు. వారికిి ఫ్లవర్ బొకే అందజేసి శాలువాతో సన్మానించి, వారి దంపతులకు గజమాలతో సత్కరించారు. అనంతరం పార్టీీ శ్రేణులు ఆయనతో కేకును కట్ చేయించి, మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయనకు సీతారామచంద్రస్వామి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వారు వారి కుటుంబ సభ్యులు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ నాయకులు, యువజన విభాగం నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.