టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే కార్మికులకు న్యాయం

టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వేముల నర్సింగం
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 20 ,( జనం సాక్షి ) :  వివిధ రంగాల కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం లోనే న్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వేముల నర్సింగం అన్నారు. డివిజన్ కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికు ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ కార్మిక విభాగం జన గాం జిల్లాఅధ్యక్షుడు వేముల నర్సింగం మాట్లాడు తూ కార్మికులవర్గ ప్రయోజనాలు, సంక్షేమం ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సాధ్యమని,ముఖ్యమం త్రి కేసీఆర్ కార్మిక పక్షపాతిఅని కార్మికుల అవసరా లు కష్టాలు తెలిసిన గొప్ప నాయకుడని కొనియా డారు. అంగన్వాడీ, ఆశా, వీఓఏ, ఫీల్డ్అసిస్టెంట్లు, వీఆర్ఏ, సెకండ్ ఏఎన్ఎం,మధ్యాహ్న భోజనం ,108,104, ఇతర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెట్ చేసి వేతనాలు పెంచి పర్మినెంట్ ఉద్యోగుల మాది రిగా పీఆర్సి ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. భారత దేశంలోనే తెలంగా ణా ప్రభుత్వం కార్మికుల అభివృద్ది సంక్షేమంలో ముందుకు సాగుతుందని, ప్రభుత్వ పదకాలను తారతమ్య బేధాలు లేకుండా కార్మికులకు, ప్రజల కు అందిస్తూ ప్రణాళిక బద్దంగా ముందుకు సాగు తుందని అభివర్ణించారు. అనంతరం మధ్యాహ్న భోజనకార్మికుల నూతన మండలకమిటీలు ఎన్ను కున్నారు.ఈసమావేశంలో మధ్యాహ్న భోజన కా ర్మికుల జిల్లా నాయకురాల్లు గుగులోత్ రంగమ్మ, ఖలీదా బేగం  ఘనపూర్, చిల్పూ ర్ మండలాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.