టిఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో బైకు ర్యాలీ

మునుగోడు అక్టోబర్22(జనం సాక్షి):
మండలంలోని కొరటికల్ గ్రామంలో అంబేద్కర్ చౌరస్తా నుండి టిఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో బారి బైకు ర్యాలీతో శనివారం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా తిరుగుతూ
 సిపిఐ,సిపిఎం బలపరిచిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల గెలుపు కోరుతూ నినాదాలు చేస్తూ ప్రచారం నిర్వహించారు.ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు ఐతరాజు శ్రీశైలం,మామిళ్ళ గోపాల్ రెడ్డి,శనగోని శేఖర్,భువనగిరి నరసింహ,లాలు,రమేష,తదితరులు ఉన్నారు