టిఆర్ఎస్ హయాంలోనే మహిళా అభ్యున్నతికి కృషి     

– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
  హుజూర్ నగర్ మార్చి 6 (జనం సాక్షి): టిఆర్ఎస్ హయాంలోనే మహిళా అభ్యున్నతికి కృషి జరుగుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు నందుకొని, ఆదివారం హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఘనంగా మహిళ దినోత్సవ ఉత్సవాలలో భాగంగా పట్టణ టిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు దొంతిరెడ్డి పద్మ  ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి, పారిశుద్ధ్య కార్మికులను, ఏ ఎన్ ఎం, స్వయం సహాయక సంఘాలు, మహిళ ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వారి సతీమణి రజితసైదిరెడ్డి ఘనంగా సన్మానించారు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పాటు తెలంగాణ లో మహిళలకు అంగరంగ వైభవంగా కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా అంబరానంటేలా సంబురాలు సాగుతాయి అన్నారు. మహిళా దినోత్సవ సంబరాల్లో భాగంగా హుజుర్నగర్ పట్టణ మహిళా విభాగం ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి, పారిశుద్ధ్య కార్మికులను, ఎ ఎన్ ఎం, స్వయం సహాయక సంఘాలు, మహిళ ప్రజాప్రతినిధులను సన్మానించడం చాలా సంతోషకరమని అన్నారు. కరోనా సమయంలో వివిధ శాఖల్లో ఉన్న మహిళలు వారి కష్టాన్ని మాటల్లో చెప్పలేమని,, కరోనా మహమ్మారి కి అందరూ భయపడుతున్న వేల ఇంటింటికి  వెళ్లి జ్వరం సర్వేలు, పారిశుద్ధ శుద్ధీకరణ లు ఎంతగానో కష్టపడి చేశారని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున కష్టపడిన మహిళలను గుర్తించిన ఏకైక సీఎం కేసీఆర్, యువ నాయకులు కేటీఆర్ వారు ఇచ్చిన పిలుపు మేరకు సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.
హుజూర్ నగర్ మున్సిపాలిటీ లో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు దొంతిరెడ్డి పద్మ కి,  పట్టణ మహిళా కమిటీ,1 నుండి 28 వార్డు అధ్యక్షురాలు, కమిటి  సభ్యులు, పట్టణ సీనియర్ మహిళా నాయకురాలు, మహిళా కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన, మహిళా కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.