టిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
హైదరాబాద్,అక్టోబర్15(జనంసాక్షి):రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం జిల్లాలో పలు పార్టీల నుంచి టీఆర్‌ఎస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. బొంగుళూరులో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీల నుండి 100 మంది యువకులు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ సమక్షంలో టీఆర్‌ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నం కోసం రూ.12 వందల కోట్ల నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని చూడకుండా అన్ని గ్రామాలను అభివృద్ధి చేశారనన్నారు. మళ్లీ కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని కోరారు.